అధికారులకు షాకిచ్చిన వాలంటీర్.. ఫించన్ డబ్బుతో ఏం చేశాడంటే ?

by Mahesh |   ( Updated:2021-05-02 01:19:52.0  )
అధికారులకు షాకిచ్చిన వాలంటీర్.. ఫించన్ డబ్బుతో ఏం చేశాడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకటో తారీఖు వచ్చేసింది.. పింఛను కోసం లబ్ధిదారులు అందరు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాలంటీరు ఇంటికి ఎప్పుడు వస్తాడా? ఫించన్ డబ్బులు ఎప్పుడిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు. ఒకటో తారీఖు వెళ్లిపోయి రెండో తారీఖు కూడా వచ్చింది కానీ వాలంటీరు మాత్రం రాలేదు. దీంతో లబ్ధిదారులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పింఛన్ పంచుతానని లక్ష రూపాయలు తీసుకెళ్లిన వాలంటీర్ అటు నుండి అటే పరారయ్యాడని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలో గ్రామ సచివాలయాలకు చెందిన కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా క్లస్టర్లకు చెందిన వాలంటీర్లకు శుక్రవారం డబ్బులు అందించారు. అందరిలానే బైరాపురం పంచాయతీకి చెందిన ఒకటో క్లస్టర్ వాలంటీరు మధుసూదన్‌రెడ్డి కి రూ. 1,05,500 అందజేశారు. అయితే ఫించన్ డబ్బులు తీసుకున్న మధుసూదన్ వాటితో పరారయ్యాడు. దీంతో ఫించన్ అందని లబ్ధిదారులు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో మధుసూదన్ పరారయ్యిన విషయం వెలుగుచూసింది. దీంతో మధుసూదన్‌రెడ్డి పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story