- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వోడాఫోన్ Idea కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం కంపెనీలు కష్టాల నుంచి గట్టెక్కె ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సోమవారం భారతీ ఎయిర్‌టెల్ తన టారిఫ్ ధరలను 20-25 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా వొడాఫోన్ ఐడియా సైతం తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త టారిఫ్‌లను మంగళవారం వెల్లడించింది. కొత్త రేట్లు నవంబర్ 25 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. పెంచిన టారిఫ్‌లను టారిఫ్ వాయిస్ ప్లాన్, అన్‌లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్-అప్‌ల పేరుతో మూడు విభాగాలుగా వొడాఫోన్ ఐడియా విభజించింది.
రూ.79తో 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న టారిఫ్ వాయిస్ ప్లాన్‌ను రూ.99కి పెంచింది. అన్‌లిమిటెడ్ వాయిస్ బండిల్స్ కింద 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ.149 నుంచి రూ. 179కి, రూ. 249ని రూ. 299కి పెంచారు. 56 రోజుల ప్లాన్ రూ.399ను రూ.479కి పెరిగింది. రూ.599తో వచ్చే 84 రోజుల ప్లాన్‌ను రూ.719కి పెంచారు. వార్షిక ప్లాన్‌గా వచ్చే రూ.1,499ని రూ.1,799కి, రూ.2,399ని రూ.2,899కి పెంచారు. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.48 డేటా టాప్-అప్‌ను రూ.58కి, 12జీబీతో వచ్చే డేటా ప్లాన్ రూ.98ని రూ.118కి, 56 రోజుల వ్యాలిడిటీతో 100జీబీ డేటా లభించే రూ.351 ప్లాన్‌ను రూ. 418కి పెంచుతూ వొడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకుంది.
వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు)ని మెరుగుపరిచేందుకు, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని పరిష్కరించేందుకు ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని కంపెనీ స్పష్టం చేసింది. పెంచిన ధరల ద్వారా వొడాఫోన్ ఐడియా తన మొబైల్ నెట్‌వర్క్ మెరుగుపరిచేందుకు వీలవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఇది ప్రభుత్వ డిజిటల్ ఇండియా కలను సాకారం చేస్తుందని కంపెనీ వెల్లడించింది.