- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 శాతం స్టీల్ ప్లాంట్ అమ్మకం.. అవసరమైతే ఉద్యోగుల తొలగింపు : కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ప్లాంట్ అమ్మొద్దని ఉద్యోగులు చెప్పడం సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు కూడా సిద్ధమని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 100శాతం స్టీల్ ప్లాంట్ అమ్ముతామని, ఇప్పటికే బిడ్డింగులు కూడా ఆహ్వానించామని అఫిడవిట్‌లో పేర్కొంది.
స్టీల్ ప్లాంట్ అమ్మొద్దంటూ దాఖలైన పిటిషన్ విచారణ అర్హత లేదని కేంద్రం స్పష్టంచేసింది. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా పలు కీలక అంశాలను కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్న సమయంలో కేంద్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.