- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు గ్రామాలు ఖాళీ చేస్తే చాలు: విశాఖ సీపీ మీనా
విశాఖపట్టణంలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత రాత్రి వీటికి అంతు లేకుండా పోయింది. దుర్ఘటన అనంతరం రాత్రి 10: 30 సమయంలో తొలిసారి గ్యాస్ లీక్ అయితే రెండో సారి 2 గంటల సమయంలో మరోసారి లీక్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో హెచ్చరికలు హల్చల్ చేశాయి.
ఎన్‌ఏడీ కొత్తరోడ్, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట, సుజాత నగర్, పెందూర్తి, హనుమంతవాక ప్రాంతాలకు లీకైన గ్యాస్ వ్యాపిస్తుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లెక్కారు. దీంతో వైజాగ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీపై వస్తున్న వదంతులను నమ్మొద్దని విశాఖ పోలీస్ కమిషనర్ (సీపీ) ఆర్కే మీనా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.
ఈ సంస్థకు రెండు కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్నవారిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఖాళీ చేయాలని కోరామని అన్నారు. ఈ సంస్థకు చుట్టుపక్కల ఉన్న వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్ గ్రామాల ప్రజలు మినహా మిగతా ప్రాంతాల్లో నివాసితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ ఐదు గ్రామాల వారు తప్ప మిగిలినవారంతా ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు.
tags: lg polymers, visakhapatnam, fake news, police, rk meena