నా ఆహారాన్ని నేనే పండించుకుంటా : సమంతా అక్కినేని

by Anukaran |
Akkineni Samantha
X

దిశ, కూకట్‌పల్లి: భావితరాలకు బంజరు భూములను అందించడం తనకు ఇష్టం లేదని సీనినటి అక్కినేని సమంతా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫిక్కీ లేడీస్​ఆర్గనైజేషన్(ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో శనివారం వర్చువల్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న సమంతా అక్కినేనితో పాటు నారాయణపేట​ కలెక్టర్​ హరిచందన, సేజ్​ఫార్మా కేఫ్ చీఫ్ క్యూరేటర్ ఎంఎస్​కవితా మంతా, సహ వ్యవస్థాపకుడు, సీఎస్ఓ అర్బన్ కిసాన్ డాక్టర్ సైరామ్ పి.రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సదస్సును ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ ఎంఎస్ ఉమా చిగురుపతి నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ సుస్థిరతపై “ప్రకృతిని పెంపొందించడం” అనే అంశంపై వర్చువల్ ప్యానెల్ చర్చ జరిగింది. దీనిపై సమంత మాట్లాడుతూ.. భవిష్యత్తులో తన పిల్లలకు బంజరు భూములను వదిలివేయడం తనకు ఇష్టం లేదని అన్నారు.

కరోనా పాండమిక్ తన జీవన దృక్పథాన్ని మార్చిందని. తను శాఖాహారిగా మారిపోయానని అన్నారు. అదేవిధంగా నేల లేకుండా మొక్కలను పెంచే కొత్త విధానం హైడ్రోపోనిక్స్ ద్వారా తన ఆహారాన్ని తానే పండించుకుంటున్నానని అక్కినేని సమంత అన్నారు. అనంతరం ప్రతిఒక్కరూ ఎంతో కొంత భూమిని కలిగి ఉండాలని సొంత ఆహారాన్ని పండించుకోవాలి అని కవితా మంత అన్నారు. హైడ్రోపోనిక్స్ ద్వారా ఎవరైన తమకు కావలసిన కూరగాయలను పండించవచ్చునని అర్బన్ కిసాన్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సైరామ్ పి. రెడ్డి తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే ఆరోగ్యంగా ఉంచదని, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా అవసరమని నారాయణపేట కలెక్టర్​ హరి చందన అన్నారు. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్బంగా ఫిక్కీ లేడీజ్ ఆర్గనైసెషన్ నిర్వహించిన ఈ సదస్సులో 120 మంది సభ్యలు పాల్గొన్నారు.

Advertisement

Next Story