‘రైతు లేనిదే ఆహారం లేదు’.. నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారి ఫొటో

by Shyam |   ( Updated:2021-11-08 07:06:07.0  )
‘రైతు లేనిదే ఆహారం లేదు’.. నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారి ఫొటో
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని వరి కొనుగోళ్ల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయిన వేళ ట్విట్టర్లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న తెలంగాణలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ చిన్నారి పుట్టి ఆరవ నెల పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్వీట్ ప్రకారం.. ‘‘ రైతు లేకుంటే మెతుకు లేదు. మెతుకు లేకుంటే మన బతుకే లేదు..!! వరి వద్దు సరే.. ప్రత్యామ్నాయ దారి అయితే చూపాలిగా? ఉన్న నియోజకవర్గం వదిలి పక్కదాంట్లో పోటీ చేయమంటేనే ఎమ్మెల్యేలు కిందామీదా పడతారు.. అలాంటిది తెలిసిన పంట వదలమంటే రైతెక్కడ పోవాలే?.’’ ఇలా రైతు లేనిదే ఆహారం లేదంటూ చెబుతూ ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed