- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గణేష్ చతుర్థి అంటే ఏమిటో తెలుసా.. ?
దిశ, వెబ్‌డెస్క్ : వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభా .. అంటే చాలు, ఆర్తులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విఘ్నాధిపతి. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అయితే పనులకు, సిద్ధికి ఆటంకాలే విఘ్నాలు, విపత్తులే విఘ్నాలు అంటూ శాస్త్ర నిర్వచనం. ఆ విఘ్నాలను తొలగించే దైవంగా వినాయకుడిని కొలుచుకొంటారు. మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు మొదటిగా వినాయకుడిని పూజిస్తారు. అయితే చాలా మంది వినాయుకుడిని పూజిస్తారు. కానీ, అందులో చాలా మందికి గణేష్ చతుర్థి అంటే తెలియదు.
వినాయకుడి పుట్టినరోజును గణేష్ చతుర్ధి అంటారు. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధి చెందే 4 వ రోజున) నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. అదే రోజున నవరాత్రులు ప్రారంభమవుతాయి. తరువాత 10 రోజుల పాటు పండుగ ఉంటుంది. అనంతరం అనంత చతుర్దశి (చందమామ వృద్ధి చెందే 14వ రోజున) నాడు పండుగ ముగుస్తుంది. ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వినాయకుడికి పూజలు చేస్తే వినాయకుడి అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.