సర్పంచ్ మాట లెక్కచేయని వ్యాపారి.. ఫైర్ అవుతున్న ప్రజలు

by Sridhar Babu |
bachat
X

దిశ, మానకొండూరు : కరోన వేళ సామాన్యులు కొంత మేరకు ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆ సర్పంచ్ నిర్ణయాన్ని ఓ వ్యక్తి వినకుండా కరోనా నిబంధనలు పాటించుకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చూనూర్ గ్రామంలో.. కరోనా వేళ అందరూ పౌష్టిక ఆహారం తీసుకోవాలన్న ఉద్దేశ్యంలో గ్రామ సర్పంచ్ నర్మెట వసంత వీరయ్య.. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మటన్‌ ధరలను నిర్ణయించారు. మర్యాదపూర్వకంగా, స్నేహాభావంతో అన్ని మటన్ షాపుల యజమానులకు పొట్టేలు మాంసం రూ. 650 చొప్పున, మేక మాంసం రూ. 550 చొప్పున అమ్మాలని రేటు ఫిక్స్ చేశారు.

ఎవరి వద్ద కూడా ఎక్కువ డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. ఈ క్రమంలో మటన్ తక్కువ ధరలో దొరుకుతుందని గ్రామస్తులు ఆనందపడ్డారు. కానీ, ఓ ఇంతలోనే మటన్ షాప్ యజమాని మహమ్మద్ బజాత్.. సర్పంచ్ మాటను పక్కనపెట్టి తనకు నచ్చిన విధంగా.. కరోనా రూల్స్ బ్రేక్ చేస్తూ.. సామాజిక దూరం పాటించకుండా, మాస్క్ లేకుండా మటన్ కొట్టడమే కాకుండా, రోడ్డుపై విచ్చలవిడిగా వాహనాలను పెట్టడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

అంతేకాకుండా పొట్టేలు మాంసం కిలోకి రూ. 650 కి అమ్మాల్సి ఉండగా.. బజాత్ తెలివిగా.. రెండు ముక్కలు ఎక్కువ వేశానంటూ.. కిలో మటన్‌ను రూ. 700 లకు అమ్ముతూ కస్టమర్లను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కస్టమర్ అదేంటి ఇక్కడ అందరూ ఒకే ధరకు అమ్మాలి.. నువ్వేంటి అరకిలోకు రూ. 350 తీసుకుంటున్నావు అంటే.. నేను ఒక్క ముక్క ఎక్కువ వేశాను.. అంటూ పొంతనలేని సమాధానం చెప్పి కస్టమర్లను పంపిస్తున్నాడు. అంతే కాకుండా కరోనా వేళ పరిశుభ్రత పాటించుకుండా మటన్ అమ్ముతుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రూల్స్ బ్రేక్ చేస్తూ మటన్ అమ్ముతున్న మహమ్మద్ బజాత్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed