ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలి: కలెక్టర్

by Shyam |
ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలి: కలెక్టర్
X

దిశ, మెదక్: కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని బైలంపూర్, మామిడియాల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. భూనిర్వాసితులకు తాత్కాలిక వసతి కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇండ్లు ఖాళీ చేయాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి గ్రామస్తులకు సూచించారు. సోమవారం గజ్వేల్‌లోని ఐఓసీ భవనంలో గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం సామగ్రిని తరలించేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. బాధితులకు కేటాయించిన తాత్కాలిక వసతి గృహాలకు ఈ నెల 29 లోగా షిఫ్ట్ కావాలని కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు.

tag: collector Venkatram Reddy, meeting, Villagers, shifted house, siddipet

Advertisement

Next Story