కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామ పెద్దలు.. వారితో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు

by Shyam |   ( Updated:2021-03-14 23:00:33.0  )
కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామ పెద్దలు.. వారితో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు
X

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి తాడ్వాయి మండలం చిట్యాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నిట్టు నాగేందర్ అనే వ్యక్తి కుటుంబాన్ని గ్రామపాలక వర్గం బహిష్కరించింది. గ్రామ పెద్దలు చెప్పిన మాట వినలేదన్న కారణంగానే వారిని గ్రామం నుండి బహిష్కరించినట్టు సమాచారం. గ్రామంలో ఎవరైనా నాగేందర్ కటుంబ సభ్యులతో మాట్లాడితే.. వారికి 25 చెప్పు దెబ్బలు, రూ.10వేల జరిమానా అంటూ గ్రామ పెద్దలు చాటింపు వేయించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story