"పులివెందుల ఫోబియాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించాలి"

by srinivas |   ( Updated:2020-02-29 02:03:06.0  )
పులివెందుల ఫోబియాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించాలి
X

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేతలపై ట్విట్టర్ మాధ్యమంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ పులివెందుల గూండాలు అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేసిన నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్‌లను లక్ష్యం చేసుకుని పేర్లు చెప్పకుండా విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

వైద్య శాస్త్రంలో ఎక్కడా కనిపించని ఓ రోగం, రాష్ట్రంలోని తండ్రీ కొడుకులను పట్టుకుందని, దాని పేరు ‘పులివెందుల ఫోబియా’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. “వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు” అని విజయసాయి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story