kangana in Thalaivi :కంగనపై బాహుబలి రైటర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

by Shyam |   ( Updated:2021-09-06 04:50:42.0  )
kangana in Thalaivi :కంగనపై బాహుబలి రైటర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతోంది. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన చిత్రంలో అరవింద స్వామి ‘ఎంజీఆర్’గా కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మూవీ టీమ్‌తో పాటు కంగనా కూడా హాజరైంది. ఈ సందర్భంగా ‘తలైవి’కి కథ అందించిన బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్.. కంగనాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘జయలలిత గురించి కంగనాకు తెలియదు కాబట్టి, ముందుగా ఈ సినిమా అంగీకరించేందుకు సందేహపడింది. నువ్వు నీలాగే ఉంటే చాలని చెప్పడంతో వెంటనే అంగీకరించింది. ఆమె ఏదో ఒకరోజు తప్పకుండా అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది’ అని తెలిపారు.

ఇక డైరెక్టర్ ఏఎల్ విజయ్ మాట్లాడుతూ.. ‘కంగన ఈ పాత్రలో జీవించింది. సినిమా మొత్తం జయలలితతో పాటు కంగన జీవితం గురించే ఉంటుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అరవింద స్వామి సినిమాకు పిల్లర్‌గా నిలిచారు. మూడేళ్ల పాటు పాండమిక్‌లోనూ స్ట్రాంగ్ సపోర్ట్‌గా నిలిచిన టీమ్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.

Advertisement

Next Story