- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4వ ర్యాంకుపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ హర్షం
దిశ, ఏపీ బ్యూరో: పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’ ప్రకటించిన అవార్డుల్లో విజయవాడకు నాలుగో స్థానం దక్కడంపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో గతేడాది నుంచి ప్లాస్టిక్ ను నిషేధించాం. ప్రజలు ఆదరించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కృషి మరువలేనిదన్నారు ప్రసన్న కుమార్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సహకారంతో ఈ విజయాన్ని సాధించాం. వచ్చే ఏడాది ప్రథమ స్థానంలో నిలిచేందుకు కష్టపడతాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖకు 9వ స్థానం
లక్ష నుంచి 10 లక్షలు జనాభా కలిగిన పట్టణాల జాబితాలో విశాఖ పట్నం తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ తొలి స్థానంలో నిలవగా.. మైసూర్ రెండో స్థానంలో, న్యూదిల్లీ (ఎన్‌డీఎంసీ) మూడో స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీలో తిరుపతి 6వ ర్యాంకు సాధించగా రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, కరీంనగర్ 72, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, తాడిపత్రి 99వ ర్యాంకులు సాధించాయి.
స్వచ్ఛతపై ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే ఇదేనని అధికారులు తెలిపారు. 28 రోజుల పాటు సర్వే జరిగింది. సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి 24 లక్షలకు పైగా ఫొటోలను జియోట్యాగ్ చేశారు. 1.9 కోట్ల మంది పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇది పూర్తిగా డిజిటల్ సర్వే. అవార్డులు పొందడానికి కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.