Chandrababu: రాష్ట్రానికి సీఎం అయినా కుప్పం ఎమ్మెల్యేనే.. ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:6 Jan 2025 11:45 AM  )
Chandrababu: రాష్ట్రానికి సీఎం అయినా కుప్పం ఎమ్మెల్యేనే.. ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదు సంవత్సరాలు విధ్వంస పాలన జరిగిందని, విశ్వవిద్యాలయాలను కూడా రాజకీయాలకు అడ్డాగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. కుప్పం పర్యటనలో(Kuppam Tour) ఉన్న ఆయన.. కుప్పం అభివృద్ధి(Kuppam Development)పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPP) ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎం అయినా కుప్పం ఎమ్మెల్యేనే అని, నేను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యే మీ మనిషిని అని చెప్పారు. అలాగే రాజకీయాల ద్వారా మంచి పబ్లిక్ పాలసీ తీసుకువస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను అణిచివేశారే తప్ప.. అభివృద్ధి చేయలేదని, ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసక పాలన జరిగిందని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు సుపరిపాలనలోకి అడుగు పెట్టామని అన్నారు.

1995లోనే ఎవరూ ఊహించని విధంగా విజన్-2020(vision 20202) గురించి మాట్లాడానని, ఇప్పుడు మళ్లీ స్వరాంధ్రవిజన్ 2047(Swarnandravision 2047)తో మీ ముందుకు వచ్చామని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి అయిన దూరదృష్టితో, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే విజయం వరిస్తుంది అని చంద్రబాబు సూచించారు. ఇక కుప్పం అభివృద్ధి కి ఎంతో దోహద పడ్డామని, కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం ఎన్టీఆర్ అని తెలిపారు. అది ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనం అని, యూనివర్సిటీకి స్థల కేటాయింపు గురించి ఆలోచిస్తున్నప్పుడు.. యూనివర్సిటీకి అనువైన స్థలం కుప్పం అని తానే సలహా ఇచ్చానట్లు పేర్కొన్నారు. అంతేగాక గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థను నిర్వర్యం చేయడమే గాక.. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. స్వర్ణ కుప్పం విజన్-2029(Swarnkuppam vision 2029) డాక్యుమెంట్ ఆవిష్కరించిన ఆయన.. మోడల్ నియోజకవర్గంగా, టూరిజం హబ్ గా మార్చేందుకు నిర్ధిష్ట ప్రణాళిక తయారు చేస్తున్నామని, పీపీపీ విధానంతో కుప్పం దశాదిశ మారుస్తామని స్పష్టం చేశారు.

Next Story