అధిష్టానం బుజ్జగింపులు..శాంతించిన అసంతృప్తులు

by srinivas |
kesineni swetha
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడటంతో వారంతా శాంతించారు. ఇంతలో విజయవాడ మేయర్ అభ్యర్థి శ్వేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఇంటికి వెళ్లారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు నాగుల్ మీరాలను శ్వేత మద్దతు కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బోండా ఉమా అధిష్టానంతో తమ సమస్యలను చెప్పుకున్నట్లు తెలిపారు. ఈ నిమిషం నుంచి లోపాలకు తావు లేకుండా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధిష్టానం ప్రకటించిన మేయర్ అభ్యర్థి శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకి తమ అభిప్రాయాలు తెలిపినట్లు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. శ్వేత అభ్యర్థిత్వాన్ని తాము ఎక్కడా వ్యతిరేకించలేదన్నారు.

ఆదివారం జరిగే చంద్రబాబు రోడ్ షోలో తామంతా పాల్గొనబోతున్నట్లు తెలిపారు. పార్టీ లైన్ దాటే మనుషులం కాదని చెప్పుకొచ్చారు. విజయవాడ టీడీపీ అభ్యర్థి శ్వేత మాత్రమేనని ఆమె గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం అంతా కలసి కట్టుగా పని చేస్తామని మేయర్ అభ్యర్థి శ్వేత తెలిపారు. తమ పార్టీలో గ్రూప్ తగాదాలేవీ లేవని చెప్పుకొచ్చారు. బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో గతంలోనూ కలిసి పని చేశానని.. ఇకముందు పని చేస్తానని చెప్పుకొచ్చారు. వైసీపీ అరాచకాలను ఎండగట్టటమే తమ లక్ష్యమని మేయర్ అభ్యర్థి శ్వేత తెలిపారు.

Advertisement

Next Story