తీవ్ర పరిస్థితులేర్పడుతున్నాయి: విజయశాంతి

by Shyam |   ( Updated:2020-03-23 21:56:44.0  )
తీవ్ర పరిస్థితులేర్పడుతున్నాయి: విజయశాంతి
X

కరోనా వైరస్ (కొవిడ్ -19) వ్యాప్తిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, తెలంగాణలో ఇప్పటికే కరోనా సొకిన వారి సంఖ్య 33 దాటిందన్నారు. ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా మనం గొప్పోళ్లం ఏమీ కాదనీ, అజాగ్రత్తతో వచ్చిన పరిణామాల వల్ల తక్కువ జనాభా ఉన్న ఆ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయని అన్నారు. మన దేశంలో అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవని తెలిపారు. ప్రజలంతా వివేకంతో ఆలొచించాలని కోరారు.

Tags: coronavirus (covid-19), telangana state, dangerous, actress vijayashanti

Advertisement

Next Story