మహిళను కాపాడిన విజయపురి టౌన్ పోలీసులు

by Sumithra |   ( Updated:2021-08-05 22:03:09.0  )
మహిళను కాపాడిన విజయపురి టౌన్ పోలీసులు
X

దిశ, నాగార్జునసాగర్ : విజయపురి టౌన్ పోలీసులు ఒక మహిళ ప్రాణాలను కాపాడారు. నాగార్జునసాగర్ ఎస్ఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి (28) కుటుంబ సమస్యల కారణంగా నాగార్జున సాగర్ కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.

ఇది గమనించిన విజయపురి టౌన్ పోలీసులు వెంకటలక్ష్మిని చాకచక్యంగా రక్షించారు. అనంతరం వెంకటలక్ష్మికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, ఆమె కుంటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారి అన్నయ్య కు ఆమెను అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ రవి గౌడ్, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story