విజయ గర్జనను విజయవంతం చేద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Aamani |   ( Updated:2021-11-01 08:21:24.0  )
విజయ గర్జనను విజయవంతం చేద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్: టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్‌ 15న వరంగల్‌లో విజయ గర్జన సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. దివ్యా గార్డెన్‌లో నిర్వహించిన నిర్మల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ విసృత్త స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్నివర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావమై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లోక భూమారెడ్డి, సత్యనారాయణ గౌడ్, రఘునందన్ రెడ్డి, నల్లా వెంకట్‌రామ్ రెడ్డి, ఆల్లోల గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story