లైగర్ నుంచి మరో సర్‌ప్రైజ్ రెఢీ..

by Shyam |
liger
X

దిశ, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని గతంలో ప్రామిస్ చేశాడు. తన 34వ బర్త్‌డే సందర్భంగా చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకునేలా రేపు తన లేటెస్ట్ మూవీ ‘లైగర్’ నుంచి అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయంపై కో-ప్రొడ్యూసర్ చార్మి ట్వీట్ చేస్తూ.. ‘వాగ్ధానాలు నెరవేర్చేందుకే ఉద్దేశించబడ్డాయి. మా లైగర్@ విజయ్ దేవరకొండ అందుకు సిద్ధంగా ఉన్నాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు లైగర్ ప్రామిస్‌ను మిస్ కాకండి’ అని పోస్టు చేసింది. ఇక టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగిపోగా.. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విజయ్ చేస్తున్న రోల్ గురించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్‌ఫర్మేషన్‌ లీక్ కాకపోగా.. పాత్ర కోసం విజయ్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ అనన్య పాండే.. మొదటిసారి తెలుగు చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రోనిత్ రాయ్, రమ్యకృష్ణ, విషు రెడ్డి, అలీ తదితరులు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.

Advertisement

Next Story