- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నయన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన బాయ్‌ఫ్రెండ్
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్‌లోనే వీరి పెళ్లి జరుగుతుందనే రూమర్స్ స్ప్రెడ్ అయినా ఫేక్ అని తేలిపోయింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ చిట్ చాట్‌లో పాల్గొన్న శివన్.. నయన్‌తో రిలేషన్, మ్యారేజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. పెళ్లి ఎప్పుడు? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్న అభిమాని ప్రశ్నకు.. అందుకోసమే మనీ సేవ్ చేస్తున్నామని, కరోనా టైమ్ ఎప్పుడు ఎండ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నామని తెలిపాడు.
నయన్ బ్యూటీ సీక్సెట్ ప్రేయర్ అని వివరిస్తూ.. తనను చీరకట్టులో చూడటమంటే ఇష్టమని, తనతో ఉంటే ఏ ప్లేస్ అయినా ఫేవరేట్‌గా మారిపోతుందన్న శివన్.. తనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తంగమే సాంగ్ అని చెప్పాడు. కాగా నయన్ ఫేవరేట్ మూవీ ‘రాజా రాణి’ అని, అంతపెద్ద యాక్టర్ అయినా సరే ఇంట్లో పాత్రలు తనే శుభ్రం చేస్తుందని తెలిపాడు. ఇక సినిమా ప్రపంచంలోకి వచ్చేందుకు ఇన్‌స్పైర్ చేసిన రజనీకాంత్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనేది డ్రీమ్ అని చెప్పాడు. అంతేకాకుండా లవ్ జోనర్ మాత్రమే కాదు సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, ఎమోషనల్ డ్రామాలంటే తనకు ఇష్టమని, ఒకవేళ లాటరీ తగిలితే చారిటీకి ఇచ్చేస్తానని తెలిపాడు శివన్.