రేవంత్‌పై విరుచుకుపడ్డ వీహెచ్

by Anukaran |   ( Updated:2020-08-13 04:53:23.0  )
రేవంత్‌పై విరుచుకుపడ్డ వీహెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. రేవంత్ వ్యవహారం కొత్త భిక్షగాడిలా ఉందని, తన పద్ధతి మార్చుకోవాలని మండిపడ్డారు. నేనే సీఎం అని గతంలో ఎవరూ చెప్పుకోలేదని, మాలాంటి సీనియర్లపై అడ్డగోలు పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మమల్ని కించ పరిచే విధంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీసీలు ఓట్లు వేసే మిషన్లు కాదని, మా ఓపికను పరీక్షించొద్దని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story