‘పునీత్ రాజ్‌కుమార్’ మృతిపై సంతాపం ప్రకటించిన క్రీడాలోకం

by Shyam |
‘పునీత్ రాజ్‌కుమార్’ మృతిపై సంతాపం ప్రకటించిన క్రీడాలోకం
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీపంలోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ సైతం పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త చాలా బాధకు గురిచేసింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రాజ్‌కుమార్ అకాల మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ‘ఓం శాంతి’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘కన్నడ చిత్ర పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో పునీత్ రాజ్‌కుమార్ ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు, అభిమానులకు నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా’ అని కుంబ్లే ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story