విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

by Sridhar Babu |
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
X

దిశ, దుండిగల్ : నూతనంగా నిర్మిస్తున్న కాలనీ కమాన్ పై పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలోని కేవీఆర్ వ్యాలీ కాలనీకి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుని తండ్రి పేరుమీద కమాన్ నిర్మాణం చేపట్టారు. సోమవారం ఓ కార్మికుడు కమాన్ పైకి ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ తీగలకు ఐరన్ రాడ్డు తగిలి కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం బయటికి పొక్కకుండా కాంగ్రెస్ నాయకులు అందరినీ మ్యానేజ్ చేసినట్లు సమాచారం. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా బయటికి తెలియక పోవడం విశేషం. మున్సిపల్ అనుమతులు లేకుండా కమాన్ నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్, టీపీఓ కన్నెత్తి చూడడం లేదు. శవాన్ని గాంధీ మార్చురీలో ఉంచామని, ఎత్తు అందాజు 5.5 అడుగులు, రంగు చామన ఛాయ, నలుపు జుట్టు, వైట్ కలర్ షర్ట్,బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు కింది నంబర్లకు 8332983279/8341951951/9490617210 కి సంప్రదించాలని పోలీస్ లు తెలిపారు.

Advertisement

Next Story