- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 24: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (డిసెంబర్) 31 నాటితో గడువు ముగియనున్న దృష్ట్యా, అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ..రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ లేఖ జారీ చేశారని అన్నారు. ఈ మేరకు అక్రిడిటెడ్ జర్నలిస్టుల బస్ పాస్ ల గడువును సైతం 2025 మార్చి 31 వరకు పొడిగించాలని ఆర్టీసీ ఎం.డీ ని లేఖ ద్వారా కోరారని కలెక్టర్ తెలిపారు. నూతన మార్గదర్శకాలు, విధివిధానాలు ఖరారైన అనంతరం ప్రభుత్వ ఆమోదం పొందిన మీదట కొత్త అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారని కలెక్టర్ తెలిపారు.
జనవరి 1 నుండి రెన్యూవల్ స్టిక్కర్లు
అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించిన స్టిక్కర్లను జనవరి 1వ తేదీ నుంచి కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డులపై అతికించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మీడియా మిత్రులు ఒరిజినల్ అక్రిడిటేషన్ కార్డులు వెంట తెచ్చుకోవాలని కోరారు.