నో పార్కింగ్‌లో వాహనాలు పార్కింగ్..అటువైపు చూడని ట్రాఫిక్ పోలీసులు

by Aamani |   ( Updated:2024-08-23 15:52:55.0  )
నో పార్కింగ్‌లో వాహనాలు పార్కింగ్..అటువైపు చూడని ట్రాఫిక్ పోలీసులు
X

దిశ,ఉప్పల్: చలాన్లు వేయడంలో ముందుండే ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్ తొలగించడంలో మాత్రం వెనుకంజలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఉప్పల్ లో పేరుకు మాత్రమే నో పార్కింగ్ బోర్డులు అంతా అక్రమ పార్కింగ్ లే...ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన,మెట్రో పార్కింగ్ ముందు నో పార్కింగ్ బోర్డున్న వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదని పాదాచారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎక్కడ చూసిన నో పార్కింగ్ ప్లేస్ లో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.

దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. నో పార్కింగ్ బోర్డు ఉన్న కూడా మనల్ని అడిగేదెవరు, ఆపేదెవరు అనే ధైర్యంతో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకుని నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story