దోచుకుంటున్న దళారులు

by Shyam |
దోచుకుంటున్న దళారులు
X

దిశ, హైదరాబాద్ : కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను వ్యాపారులు పెంచారు. దీంతో కూరగాయల ధరలు మాత్రం మూడింతలు పెరిగాయి. మొన్నటి వరకు కిలో టమాటా 20 రూపాయలు ఉంటే 60 నుంచి 100 రూపాయలకు చేరింది. క్యాబేజీ ధర రూ.80కు చేరింది. ఓ వైపు అధిక ధరలకు విక్రయించొద్దంటూ ప్రభుత్వం చేసిన హెచ్చరికలను వ్యాపారులు పట్టించుకోవడం లేదు. కూరగాయల ధరలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొందరు వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Next Story