- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాయంత్రం వేళల్లో ఈ బజ్జీలు తిన్నారంటే.. వావ్ అనాల్సిందే
దిశ, వెబ్‌డెస్క్ : సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక ఇంట్లో ఉన్నవారు వైఫ్‌ని లేదా, అమ్మవాళ్లని తినడానికి ఈవినింగ్ స్నాక్స్.. ఏవైనా చేయిమని చెప్దామా అని ఆలోచిస్తుంటారు. అయితే ఈవినింగ్ తినడానికి ఉల్లిపాయ, వంకాయ బజ్జీ మించిన స్నాక్స్ లేవంటున్నారు కొందరు. చాలా రుచిగా ఉండే ఈ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
సెనగ పిండి 2 కప్పులు
బియ్యంపిండి అరకప్పు
ఉల్లిపాయలు 3 చిన్నవి
లేత వంకాయలు 3
కారం రెండు చెంచాలు
గరం మసాల పొడి 2 చెంచాలు
ఉప్పు తగినంత
నూనె
తయారుచేసే విధానం : ముందుగా ఒక బౌలు తీసుకుని అందులో సెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి కొంచెం నీళ్లు పోసి చిక్కగా కలపాలి. తర్వాత ఉల్లిపాయని గుడ్రంగా అంటే చక్రాల మాదిరి తరిగి అలాగే వంకాయని కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం గ్యాస్ మీద బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో, వంకాయ, ఉల్లిపాయలు వేసి.. వేడి చేసిన నూనెలో వేస్తూ వేయించుకోవాలి. చిన్నగా మంట పెట్టి వేయించాలి. అంతే ఉల్లిపాయ, వంకాయ బజ్జీ రెడీ.. ఇవి ఇక చాలా రుచిగా బాగుంటాయి. ఈ వినింగ్ స్నాక్స్‌లోకి బాగుంటాయి.