- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ, నాన్న విడిపోయారు’.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ వైఫ్‌కి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడం సహజం. ఇక బాలీవుడ్‌లో అయితే స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి అవి మూడు మ్యారేజ్‌ల వరకైన వెళ్లే చాన్స్‌లు ఉంటాయి. అలా బాలీవుడ్ డైరెక్టర్ బోనీ కపూర్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తన ఫస్ట్ వైఫ్‌కి విడాకులు ఇచ్చే టైంకి ఈ జంటకు అర్జున్ కపూర్, అన్షు అనే ఒక పాప, బాబు ఉన్నారు. ఇక ఇక్కడ అర్జున్ కపూర్ అంటే మరెవరో కాదు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఈయన.. హిందీలో కొన్ని సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, నాన్న విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకున్నప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావిడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లో విషయాలను తెలుసుకునేందుకు బయట వాళ్ళు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్‌మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువు పై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది’ అని ఎమోషనల్‌గా అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా బోనీ కపూర్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అదే సంవత్సరంలో అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.