AP Govt:మహిళలకు ‘ఉచిత బస్సు పథకం’ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 08:04:40.0  )
AP Govt:మహిళలకు ‘ఉచిత బస్సు పథకం’ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి(NDA Alliance) ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని(Free Bus Scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో నేడు(శనివారం) మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీ(Cabinet Sub-Committee)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన ఈ కమిటీ పథకం అమలు, విధివిధానాలు, ఏపీలో ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికల్ని, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శివు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed