Virat Kohli: మరోవివాదంలో విరాట్ కోహ్లీకి చెందిన పబ్

by Shamantha N |
Virat Kohli: మరోవివాదంలో విరాట్ కోహ్లీకి చెందిన పబ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి(Virat Kohli) చెందిన 'వన్‌8 కమ్యూన్‌'(One8 Commune) పబ్ మరోవివాదంలో చిక్కుకుంది. ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బెంగళూరు బృహత్‌ మహానగర పాలికే (BBMP) నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలో ఎంజీ రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ లోని ఆరో అంతస్తులో వన్8 కమ్యూన్ పబ్ ఉంది. కాగా.. ఆ రెస్టారెంట్ కు అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదని బీబీఎంపీ పేర్కొంది. ఈ విషయంపై సామాజిక కార్యకర్తలు హెచ్‌ఎం వెంకటేష్‌, కుణిగల్‌ నరసింహమూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవంబర్‌ 29న కోహ్లికి చెందిన పబ్ కి(Virat Kohli's Bengaluru Pub) అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు వెల్లడించారు.

గతంలోనూ కేసు

ఇప్పుడు, వన్8 కమ్యూన్ పబ్ యాజమాన్యానికి ఏడు రోజుల గడువు ఇచ్చామని బెంగళూరు మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే, ఈసారి కూడా అటువైపు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోతే సదరు పబ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీలోని శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ నోటీసులో తెలిపారు. బెంగళూరులో ఎత్తైన భవనాలలో చాలా రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్నాయని సోషల్ వర్కర్ వెంకటేష్ అన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే గణనీయమైన ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు, జూలైలోనూ వన్8 కమ్యూన్‌పై కేసు నమోదైంది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా పబ్ ని నిర్వహిస్తున్నందుకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed