- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
దిశ, అశ్వారావుపేట : ద్విచక్ర వాహనాలను మాయం చేస్తున్న కేటుగాడు పోలీసులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం ఎస్సై యయాతి రాజు సిబ్బందితో కలిసి అశ్వారావుపేట మండల కేంద్రం సాయిబాబా గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తూ పోలీసులను చూసి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యాదవోలుకు చెందిన మారం మునియ అని, పలు ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులలో నిందితుడిగా గుర్తించారు.
కూలి పనులు చేస్తూ జీవిస్తూ మద్యానికి అలవాటు పడ్డాడు. కూలి పనుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నాడు. 2020-2021 లో రెండుసార్లు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడు. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ద్విచక్ర వాహనాల చోరీలను కొనసాగించాడు. అతని వద్దనున్న ఎనిమిది ద్విచక్ర వాహనాలను అమ్మేందుకు అశ్వారావుపేట వస్తుండగా పోలీసులకు చిక్కాడు. కాగా నిందితుడిపై గతంలో 61 చోరీ కేసులు ఉన్నాయి. ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ యయాతి రాజు, క్రైమ్ పార్టీ సిబ్బంది కానిస్టేబుల్ పి. నాగేంద్రబాబు, ఎన్.వెంకటేశ్వరరావు ను సీఐ కరుణాకర్ అభినందించారు.