Ameesha Patel: రూ. 100 కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలో నటించను.. డైరెక్టర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

by sudharani |
Ameesha Patel: రూ. 100 కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలో నటించను.. డైరెక్టర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘బద్రి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అమీషా పటేల్ (Ameesha Patel). మొదటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే.. లో మూవీస్ చేస్తూ మెప్పిస్తున్న అమీషా.. గతేడాది ‘గదర్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. 2001లో వచ్చిన ‘గదర్ ఏక్ ప్రేమ్‌కథ’కు సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్ 2’ (Gadar 2) మంచి సక్సెస్‌ను అందుకుంది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma) అమీషాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నర్గీస్ దత్ వంటి గొప్ప తారలు కూడా చిన్న వయసులోనే అత్తయ్య పాత్రలు చేశారని ఎంతో నచ్చజెప్పా. అయినాఅమీషా మాత్రం చేయనని చెప్పేసింది’ అని తెలిపారు.

డైరెక్టర్ కామెంట్స్‌పై అమీషా పటేల్ స్పందిస్తూ.. తాజాగా తన X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘డియర్ అనిల్.. ఇది కేవలం సినిమా మాత్రమే. కాబట్టి.. ఆన్‌స్క్రీన్‌ (onscreen)లో ఏం చేయాలి? ఏం చేడకూడదు? అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరంటే నాకెంతో గౌరవం ఉంది. ‘గదర్’ కోసమనే కాదు.. ఏ సినిమాలో అయినా నాకు రూ. 100 కోట్లు ఇచ్చినా అత్తయ్య పాత్రలు చెయ్యను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed