- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vishwak Sen: అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విశ్వక్ సేన్ సినిమా

దిశ, వెబ్ డెస్క్: హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) సినిమాలను చేస్తుంటాడు. త్వరలో ‘లైలా’ ( Laila ) మూవీతో మన ముందుకు రానున్నాడు. అయితే, ఈ హీరో గతంలో నటించిన ఒక చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. దీంతో, విశ్వక్ తో పాటు, ఆ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
విశ్వక్ సేన్, హీరోయిన్ చాందిని చౌదరి జంటగా కలిసి నటించిన చిత్రం ‘గామి’ ( Gaami ) 2024 లో మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎవరూ ఊహించలేని అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025కు ( International Film Festival Rotterdam ) గానూ విశ్వక్ సేన్ " గామి " ( Gaami ) సినిమా కూడా సెలెక్ట్ అయింది. అంతేకాకుండా, ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గామి మూవీని ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనుంది.
ఇదిలా ఉండగా, విశ్వక్ సేన్ ప్రస్తుతం " లైలా " నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ దీనిలో పవర్ ఫుల్ లేడీ గెటప్‌లో కూడా కనిపించనున్నాడు. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇక ఫుల్ బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్ మరింత ఆసక్తిని పెంచేసింది. ఇటీవలే ‘కోయ్ కోయ్’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సాంగ్ వైరల్ అవ్వడంతో విశ్వక్ సేన్ లైలా సినిమాలో వాడుకున్నారు. సాంగ్ మధ్యలో వచ్చే ఈ లిరిక్స్ పాటకే హైలెట్ గా నిలిచాయి. పెంచల్ దాస్, మధు ప్రియ కలిసి పాడిన ఈ పాట హిట్ గా మారింది.