- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Accident : బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు(Bengaluru)సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Accident) లో ఆరుగురు మృతి(Six People Dead) చెందారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంల కారు నుజ్జునుజ్జుగా మారి ఘటన స్థలం బీభత్సంగా కనిపించింది. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. వారంతా అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే అథార్టీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబాతోపాటు ఇతర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ(IAST) నిర్వహిస్తున్న చంద్రం ఎగప్పగోల్ కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. చంద్రం అగప్పగోల్ ఇటీవలె వోల్వో కారును కొనుగోలు చేశారు. మృతులను చంద్రం ఎగప్పగోల్ (46), అతని భార్య ధోరబాయి (40), కుమారుడు జ్ఞాన్ (16), కుమార్తెలు దీక్ష (10), ఆర్య (6) చంద్రం ఎగప్పగోల్ సోదరుడి భార్య విజయలక్ష్మి (35) గా గుర్తించారు. యాక్సిడెంట్‌పై నెలమంగళ మొబైల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయ్యింది. చంద్రం ఎగప్పగోల్ వాస్తవానికి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా జాట్ తాలూకాలోని మోరబాగి గ్రామ నివాసి మరియు బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.