సీఎం ఎవరనేది కాదు.. ఎవరు బాగా పనిచేశారనేది ముఖ్యం: డిప్యూటీ సీఎం పవన్‌

by Mahesh |
సీఎం ఎవరనేది కాదు.. ఎవరు బాగా పనిచేశారనేది ముఖ్యం: డిప్యూటీ సీఎం పవన్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అల్లూరి జిల్లాలో రెండో రోజు పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలు, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి పూర్తిగా వదిలే వరకు గిరిజనులను వదలను అని తేల్చి చెప్పారు. ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు తాను రిటైర్‌ అవ్వనని హామి ఇచ్చారు. అలాగే తాను ఎప్పుడు సినిమాల కోసం కలలు కనలేదని.. పేదల జీవితాలు మెరుగుపరచడమే ప్రస్తుతం తన కల అని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అపార అనుభవం ఉందని.. సీఎం ఎవరనేది ఎప్పుడు ముఖ్యం కాదని.. ఎవరు బాగా పనిచేశారనేది ముఖ్యం అని.. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed