- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబానీ, ఆదానీలకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం : జూలకంటి రంగారెడ్డి
దిశ,సంగారెడ్డి : రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం సీపీఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా కేవలం కిషన్ భవన్ లో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించకుండా కార్పొరేట్ కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం విత్తన కంపెనీలకు ఊడిగం చేస్తుందని రైతులకు ఇవ్వాల్సిన టువంటి సబ్సిడీలో కోత విధించిందనిఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సినటువంటి విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వలన ఉచిత విద్యుత్తు రైతులకు, ప్రజలకు అందకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకురావడంతో 500 రైతు ప్రజా సంఘాల కలయికతో సంవత్సర కాలం పాటు ఉద్యమం చేసి 1000 మంది రైతుల ప్రాణార్పణ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తు రైతాంగం దేశ ప్రజానికంపై ధరలబారాలు మోపుతున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో 1,80,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంవత్సరానికి 12,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేసి రైతు భరోసాను ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడక పోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి లో జరుగుతున్నా రాష్ట్ర 4 వ మహాసభ లను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నరసింహులు, జిల్లా నాయకులు బి.యాదవ రెడ్డి, నరసింహారెడ్డి, కొండాపూర్ మండల కార్యదర్శి కె రాజయ్య, కంది మండల కన్వీనర్ ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.