VH: అమిత్ షాను అరెస్ట్ చేయండి.. కేంద్రమంత్రిపై మాజీ ఎంపీ వీహెచ్ ఫిర్యాదు

by Ramesh Goud |
VH: అమిత్ షాను అరెస్ట్ చేయండి.. కేంద్రమంత్రిపై మాజీ ఎంపీ వీహెచ్ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి అమిత్ షాపై(Union Minister Amit Shah) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (Congress Leader V Hanumantha Rao) ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా పార్లమెంట్(Parliament) వేదికగా రాజ్యంగం రాసిన డా. బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar ని అవమానపరిచే విధంగా మాట్లాడారని వీహెచ్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ (Amberpeta Police Station)లో ఫిర్యాదు(Complaint) చేశారు. ఈ సందర్భంగా ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖను అంబర్ పేట ఎస్సైకి అందజేశారు. అంతేగాక అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎప్పుడు అవమానపరచలేదని, అంబేద్కర్ ని గౌరవించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed