Telangana Legislative Council : కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవే

by M.Rajitha |
Telangana Legislative Council : కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనమండలి(Telangana Legislative Council) నేడు మూడు కీలక బిల్లులు ఆమోదించిన విషయం తెలిసిందే. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు(Telangana Municipality Amendment Bill), జీహెచ్ఎంసీ సవరణ బిల్లు(GHMC Amendment Bill), తెలంగాణ పంచాయితీరాజ్ బిల్లుల(PanchayithiRaj Bill)కు శనివారం మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ప్రకారం మహబూబ్ నగర్, మంచిర్యాల మున్సిపాలిటీలను కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేశారు.

కొత్తగా 12 మున్సిపాలిటీలుగా.. సంగారెడ్డి జిల్లాలో కోహిర్, గడ్డ పోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, జనగాం జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్, నారాయణపేట జిల్లాలో మద్దూర్, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మెయినాబాద్ ను అప్ గ్రేడ్ చేశారు. అదే విధంగా పరిగి మున్సిపాలిటీలో మరో ఆరు గ్రామాలు, నర్సంపేటలో ఏడు గ్రామాలు, నార్సింగిలో ఒకటి, శంషాబాద్ లో ఒక గ్రామం, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మరో ఆరు గ్రామాల విలీనం చేశారు.

Next Story

Most Viewed