Curiosity : వామ్మో.. ఈ చికెన్ ధర బంగారంకంటే ఎక్కువే!

by Javid Pasha |
Curiosity : వామ్మో.. ఈ చికెన్ ధర బంగారంకంటే ఎక్కువే!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనం తినే చికెన్ లేదా కోడి కిలో ధర రూ. 100 నుంచి రూ. 250 వరకు ఉంటుంది. కానీ కొన్నిచోట్ల మాత్రం అలా కాదు. కిలో బరువు గల ఒక కోడిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని కోళ్లు వాటి అరుదైన ఆకృతి, ప్రత్యేకతల కారణంగా వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటోంది. వాటిపట్ల ప్రజల్లో ఉన్న సెంటిమెంట్, క్రేజ్ కారణంగా ఫుల్ డిమాండ్ ఉంది. అలాంటి అరుదైన జాతి కోళ్లు ప్రపంచంలో ఏడు రకాలు ఉన్నాయి. అయితే వీటిని కొనడానికి పెట్టే డబ్బులతో బంగారం కూడా కొనవచ్చు అంత విలువైనవి అంటున్నారు ఔత్సాహికులు. ఆ అరుదైన జాతి కోళ్లు ఏవో చూద్దాం.

అయామ్ సెమని, రూ. 2 లక్షలు

అయామ్ సెమని అనే ఒకరకమైన కోడి జాతి ఇండోనేషియాలో చాలా ఫేమస్. ఇది పూర్తి నల్లగా ఉంటుంది. ఈ దేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. దీని రక్తం, మాంసం, ఎముకలు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. అయితే అక్కడి వాతావరణం, జన్యుపరమైన కారణాలు ఇందుకు కారణం కాగా.. చాలా మంది ప్రజలు ఇది పవిత్రమైన కోడి అని నమ్ముతారు. ఈ సెంటిమెంట్ కారణంగా దాని మార్కెట్ విలువ కిలో రూ. 2 లక్షలు పలుకుతోంది.

డాంగ్ టావో, రూ. 1, 50, 000

వియత్నాంలో డాంగ్ టావో అనే కోడి చాలా ఫేమస్. దీని పాదాలు సాధారణంకంటే పెద్దగా లావుగా ఉంటాయి. కాగా దీని మాంసాన్ని రెస్టారెంట్లలో ఖరీదైన స్పెషల్ భోజనంగా పరిగణిస్తారు. ఒక్కసారైనా ఈ డాంగ్ టావో మాంసం తినకపోతే మంచిది కాదని వియత్నాంలో చాలామంది భావిస్తారట. అందుకే ఇది చాలా ప్రత్యేకం. అరుదుగా లభించే ఈ జాతి కోడి ఒక కిలో ధర రూ. 1,50, 000

సెరమా : రూ. 85,000

సెరమా మలేషియన్ జాతి కోళ్లలో అరుదైన జాతిగా పరిగణిస్తారు. చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. బరువు కూడా తక్కువే. కానీ ఇవి వాటి అందం, ఆకృతి కారణంగా పెంపుడు కోళ్లుగా ఉంటున్నాయి. అయితే దీనికి డిమాండ్ ఎక్కువ. సెరమా ఒక కిలో ధర రూ. 85000 పలుకుతుంది.

సిల్కీ, రూ. 50,000

సిల్కీ అనేది చైనాకు చెందిన అరుదైన కోడి జాతి. ఇది సిల్కీ రెక్కలకు ప్రసిద్ధి చెందింది. దాని రెక్కలు చాలా మృదువైనవిగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే పట్టులా అనిపిస్తాయి. చర్మం, ఎముకలు నీలరం రంగులో ఉంటాయి. ఇతర కోళ్ల నుంచి చాలా భిన్నంగా ఉంటుంది.

ఒనగడోరి, రూ. 2 లక్షలు

ఒనగడోరి అనేది జపాన్‌కు చెందిన అరుదైన కోడి జాతి. దీని తోక 12 అడుగుల పొడవే కాకుండా చాలా అందంగా ఉంటుంది. జపనీస్ సంస్కృతిలో ఈ కోడిని పెంచడం, తినడం శుభప్రదంగా, అదృష్టంగా భావిస్తారు. అందుకే దీనికి ధర ఎక్కువ. కిలో రూ. 2 లక్షలు పలుకుతుంది.

Advertisement

Next Story

Most Viewed