- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayarama Rao: రుణమాఫీపై కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన సవాల్
దిశ, వెబ్ డెస్క్:తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో రైతు భరోసా(Raithu Bharosa)పై జరిగిన స్వల్పకాలిక చర్చ కోలాహలంగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు రుణమాఫీపై మాట్లాడుతూ.. ఒకరికి మరొకరు సవాళ్లు(Challenges) విసురుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) రుణమాఫీ ఆరు ఏడు వేల కోట్ల కన్నా ఎక్కువ జరగలేదని, జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరామ రావు(Congress MLA Vijayarama Rao) మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) హయాంలో పదేళ్లలో నాలుడు విడతల్లో చేసిన రుణమాఫీ రైతులకు వడ్డీ కిందికి కూడా సరిపోలేదని వ్యాఖ్యానించారు.
2014 చేస్తామని చెయ్యలేదని, మళ్లీ 2018 ఎన్నికల్లో 2019 లోనే చేస్తామని హామీ ఇచ్చి నాలుగు విడతల్లో చివరి వరకు చేశారని, అది బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదని మండిపడ్డారు. అలాగే ఒకే ఏడాదిలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పారు. కేటీఆర్ పదే పదే అక్కడికి రా.. ఇక్కడికి రా అని మాట్లాడుతున్నాడని, కేటీఆర్ కు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే నా నియోజకవర్గానికి రావాలని నా నియోజకవర్గంలో 70% మంది రైతులకు రుణమాఫీ కాకపోతే నేను రాజీనామా చేస్తా.. రుణమాఫీ జరిగితే కేటీఆర్ రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. అంతేగాక బీఆర్ఎస్ నాయకులు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి చెప్పి నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.