- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamannaah Bhatia: తమన్నా బర్త్ డే స్పెషల్.. ‘ఓదెల-2’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే ఆమె ఐటెం సాంగ్స్‌లోనూ ఆడిపాడి దుమ్మురేపుతోంది. గత ఏడాది ‘లస్ట్ స్టోరీస్-2’(Lust Stories-2) అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. అలాగే రజినీకాంత్(Rajinikanth) సరసన నటించిన ‘జైలర్’ (Jailer)బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అదే ఫామ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంతో పాటు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఓదెల-2’(Odela-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఇది ‘ఓదెల రైల్వేస్టేషన్’(Odela Railway Station) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి అశోక్ తేజయే(Ashok Tejaye) దర్శకత్వం వహిస్తుండగా.. మధు క్రియేషన్స్, సంపత్ నంది వర్క్స్‌పై డి మధు నిర్మిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘ఓదెల-2’ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ హైప్ పెంచాయి. నేడు తమన్నా పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఓదెల-2 మూవీ శివశక్తి టీమ్ తమన్నాకు విషెస్ తెలిపారు. ఈ పోస్టర్‌లో ఆమె పుర్రెలను తొక్కుతూ కోపంగా చూస్తూ పవర్ ఫుల్ లుక్‌తో దర్శనమిచ్చింది.
Team #Odela2 wishes its 'Shiva Shakti' aka the ever charming and alluring @tamannaahspeaks a very Happy Birthday ❤️🔥 pic.twitter.com/qDRnY4k6Jy
— BA Raju's Team (@baraju_SuperHit) December 21, 2024