- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి, పీడీఎస్ రవాణాపై ఉక్కుపాదం..
దిశ, మిర్యాలగూడ : రైతుల పేరిట బోనస్ పొందడం కోసం అక్రమ మార్గంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్లపై, గంజాయి, రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ వి. సత్యనారాయణ అన్నారు. శనివారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఐజి కి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సిబ్బంది కిట్లను, రికార్డులను పరిశీలించి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నేరాలు పరిశీలిస్తే దొంగతనాలు పెరిగినట్లు సైబర్ క్రైమ్, చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఎస్సై నుండి సీఐ గా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు స్టేషన్ పరిధిలోని మూడు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండటంతో పాటు ఒక నక్సలైట్ లొంగిపోవడంతో వారిపై సర్వే లైన్స్ తో నిఘా పెడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం రైతులకు అందించే 500 రూపాయల బోనస్ ని పొందడానికి కొందరు దళారులు, మిల్లర్లు కలిసి ఫాం 10 ద్వారా అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమ మార్గంలో ధాన్యం దిగుమతి కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు, దళారులపై కేసు నమోదు చేయడంతో పాటు ధాన్యాన్ని సీజ్ చేయనున్నట్లు హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో కలిసి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు లో దళారులకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, అక్రమ రేషన్ బియ్యం రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై 18 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ఇటీవల కోదాడ, సూర్యాపేట లో పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, మిర్యాలగూడలో కూడా త్వరలోనే పీడి యాక్ట్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
గంజాయి, పిడిఎస్ రైస్ రవాణాను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాకు సహకరిస్తున్న పలువురు అధికారులు కూడా బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమార్గంలో సంపాదన కోసం చైన్ సిస్టం ద్వారా ముసుగులో ఉన్న వ్యక్తులపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాడపల్లి చెక్ పోస్ట్ ను పరిశీలించారు. అక్రమ ధాన్యం రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు వీరబాబు, కరుణాకర్, ఎస్సైలు లోకేష్, మోహన్ బాబు, శేఖర్, వెంకటేశ్వర్లు, హరికృష్ణ, కృష్ణయ్య తదితరులున్నారు.