Minister Nimmala: సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్.. ఇది నిజమైన రైతు ప్రభుత్వం!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 15:01:14.0  )
Minister Nimmala: సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్.. ఇది నిజమైన రైతు ప్రభుత్వం!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో రైతులకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. సాగునీటి ఎన్నికల్లో(election of irrigation societies) కూటమి అభ్యర్థులు 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచారని మంత్రి నిమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ గెలుపు వైసీపీకి, జగన్‌కు చెంపపెట్టు అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలను చూస్తే రైతాంగం మొత్తం కూటమి వైపే ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీకి(YSRCP) పోటీ చేసేందుకు కాదు, మద్దతిచ్చేందుకు కూడా అభ్యర్థులు లేని పరిస్థితి. ఇది చూస్తేనే ఆ పార్టీ పై రైతులు ఎంత విసుగెత్తిపోయారో అర్థమవుతోంది అని ఆయన పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు రైతులు(Farmers) ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు రైతు బిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. ఇది నిజమైన రైతు ప్రభుత్వం(AP Government) అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed