CM Revanth Reddy : రైతు రుణమాఫీ పై చేదు నిజం : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : రైతు రుణమాఫీ పై చేదు నిజం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రైతు రుణమాఫీ(Farmer loan Waiver)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు రుణమాఫీ చేదు నిజం అని, బీఆర్ఎస్(BRS) కు మింగుడుపడటం కష్టమని చురకలంటించారు. తెలంగాణ ఆస్తులు తెగనమ్మి..కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదని..వడ్డీ మాఫీ మాత్రమేనని విమర్శించారు. తన ట్వీట్ కు అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్ప కాలిక చర్చలో తాను చేసిన ప్రసంగం వీడియోను రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. రుణమాఫీ చేస్తామంటే రైతులు రెండుసార్లు నమ్మి కేసీఆర్ కు అధికారమిచ్చారన్నారు. మొదటిసారి సార్ దావత్ లల్ల ఉండి మర్చిపోయిండేమోననుకుని రెండోసారి అధికారం అప్పగిస్తే రెండోసారి వచ్చాక కూడా ఐదేళ్లలో 21లక్ష 31,557మంది రైతులకు 11,909కోట్ల 31లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన లక్షల కోట్ల అవుటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి 7,500కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. 2018-2023వరకు రూ. 8,515కోట్ల రూపాయలు రైతు రుణాల వడ్డీకి పోగా కేవలం రూ. 3,384కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నిక్కచ్చి లెక్కలు..వాస్తవాలని, ఇది చేదునిజమని, బీఆర్ఎస్ కు మింగుడుపడదని విమర్శించారు. మీరు రైతు రుణాల అసలు కట్టిందే లేదు..మాఫీ చేసిందే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Next Story