త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

by Shyam |
Union Minister Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తోన్న ‘‘జన ఆశీర్వాద యాత్ర’’ ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే చిన్నారులకూ వ్యాక్సిన్ అందజేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వారియర్లకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా మృతుల పిల్లల చదువుల బాధ్యత కేంద్రమే తీసుకుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed