వందేళ్ల వయసులో వ్యాక్సిన్ వేయించుకున్న లచ్చవ్వ

by vinod kumar |   ( Updated:2021-03-25 05:18:55.0  )
వందేళ్ల వయసులో వ్యాక్సిన్ వేయించుకున్న లచ్చవ్వ
X

దిశ, కామారెడ్డి: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నాయి. దాంట్లో భాగంగా అధికారులు, ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వందేళ్ల బామ్మ వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చింది. కామారెడ్డి పట్టణానికి చెందిన సావుసాని లచ్చవ్వ అనే బామ్మకు వైద్యులు వ్యాక్సిన్ వేశారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం సంతోషంగా ఉందని బామ్మ తెలిపింది. అందరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా భౌతిక దూరం పాటించాలని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story