సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వాక్సిన్ : మెగాస్టార్

by Jakkula Samataha |
సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వాక్సిన్ : మెగాస్టార్
X

దిశ, సినిమా: కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ద్వారా పాండమిక్ టైమ్‌లో సినీ కార్మికులను ఆదుకున్న టాలీవుడ్.. సెకండ్ వేవ్ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమాన్ని మెగాస్టార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. సీసీసీ ఆధ్వర్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అపోలో 24/7ల సహకారంతో ఈ వాక్సినేషన్ డ్రైవ్‌ను పున:ప్రారంభించినట్టు తెలిపారు. నిజానికి ఈ కార్యక్రమం మూడు వారాల క్రితమే ప్రారంభమైనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చిందని, అందుకే పున:ప్రారంభం అంటున్నానని స్పష్టం చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వర్కర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు ఫిలిం జర్నలిస్ట్‌లకు వాక్సిన్ ఇస్తామని.. రోజుకు కనీసం ఐదారు వందల మందికి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా అపోలో వారికి అభినందనలు తెలిపిన చిరు.. వ్యాక్సిన్ తీసుకునేలా సినీ కార్మికులను మోటివేట్ చేసిన సినీ పెద్దలను ప్రశంసించారు. కాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ దొరైతో పాటు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story