యూపీ ఐడల్‌గా అయోధ్య రామమందిరం శకటం

by Shamantha N |
యూపీ ఐడల్‌గా అయోధ్య రామమందిరం శకటం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతియేడు లాగే ఈసారి కూడా త్రివిధ దళాల కవాతు చూపరులను ఆకట్టుకున్నాయి. ముందుగా త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత రాజ్‌పథ్‌లో ఆర్మీ, వాయుసేన పరేడ్ వివిధ బెటాలియన్ల పరేడ్, యుద్ధట్యాంకులు, ఆయుధ సంపత్తి ప్రదర్శన అద్భుతంగా సాగింది. అనంతరం ఎప్పటిలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన జరిగింది.

అందులో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ శకటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అయోధ్య రామమందిరం నిర్మాణం నమూనాను ఈసారి యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. అంతేకాకుండా, తమ సంస్కృతిని ప్రతిబింబించే లక్షలాది దీపోత్సవ దృశ్యాలను కూడా శకటంలో ఉండేలా యూపీ సర్కార్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed