లేబర్ సెస్ వెయ్యి కోట్లు దారి మళ్లించారు

by Shyam |
లేబర్ సెస్ వెయ్యి కోట్లు దారి మళ్లించారు
X

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో : కొవిడ్-19 సంక్షోభ సమయంలో రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్‌లో ఐఎన్‌టీయుసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సెస్ ద్వారా సేకరించిన రూ.1,000 కోట్ల నిధుల నుంచి రూ.335 కోట్లను సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు, మిగిలిన నిధులను ఇతర విభాగాలకు మళ్లించినట్టు ఆరోపించారు. నిర్మాణ రంగాల నుంచి వచ్చిన సెస్ నిధులను లాక్‌డౌన్ సమయంలో.. ఇతర రాష్ట్రాలు అక్కడిగ నిర్మాణరంగ కార్మికులకు రూ.3 వేల వరకు ఆర్థిక సాయం చేసేందుకు ఉపయోగిస్తే.. తెలంగాణలో మాత్రం సీఎ కేసీఆర్ కార్మికుల నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించారని ఉత్తమ్ ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుంచి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం వలస కార్మికుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైందన్నారు. మొదట 3.5 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. మరోసారి 6 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారన్నారు. కాగా, గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాష్ట్రంలో 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని చెప్పడంతో వలస కార్మికుల సంఖ్యపై సీఎం కేసీఆర్ అజ్ఞానం బట్టబయలైదని విమర్శించారు. ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం ఉన్న ప్రతి కార్మిక కుటుంబానికి సంక్షేమ బోర్డు నుంచి రూ.3 వేలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Tags: Congress,Uttam, KCR, Minister, Srinivas Yadav, building workers,

Advertisement

Next Story