పైసల్ తీసుకుని, మందు తాగండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
పైసల్ తీసుకుని, మందు తాగండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కమలాపూర్: బీజేపీ, టీఆర్ఎస్ ఇచ్చే పైసలు తీసుకుని, ఇచ్చిన మద్యం తాగండి.. అంటూ టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈటల, కేసీఆర్ రాష్ట్రాన్ని అక్రమంగా దోచుకుని, దాచుకున్నారన్నారు. ఎవరు ఎక్కువ దోచుకున్నారో పోటీపడే క్రమంలో కొట్లాడుకుంటే వచ్చిన ఎన్నికలే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలన్నారు.

ఈటలపై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చినందున మంత్రి పదవి నుంచి తొలగించానని కేసీఆర్ అంటున్నారని.. కానీ, కేసీఆర్ తనకన్న ఎక్కువ భూ ఆక్రమణలు చేశారని ఈటల అనడం వారి అవినీతికి నిదర్శనమన్నారు. ఇలా కూడబెట్టిన అక్రమ సంపాదనతో ఉపఎన్నికలో వేల రూపాయలు, మద్యం పంచుతున్నారన్నారు. వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. యావత్ భారతదేశం మొత్తం ప్రజల తీర్పుకోసం ఎదురుచూస్తోందన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం కొట్లాడిన యువకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేయాలని ఉత్తమ్ అభ్యర్థించారు.

Advertisement

Next Story